అల్లాపూర్ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి, జూన్ 13 (విజయక్రాంతి): అల్లాపూర్ డివిజన్ లోని సమస్యలు తెలుసుకునేందుకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని యూసఫ్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సెంట్రల్ అల్లాపూర్, లక్ష్మీ నగర్ లలో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. ప్రధానంగా కాలనీలలో తాగునీటి సమస్య, కాలనీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
యూసఫ్ నగర్ లోని స్మశాన వాటికను నిర్వహించుకోవడానికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. స్థానికంగా నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు.
నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధి అంటే కూకట్పల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉండేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిహా గౌస్ ఉద్దీన్, మేడ్చల్ జిల్లా బి ఆర ఎస్ మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, నాయకులు తిరుపతి, బాబా, జావిద్, నూర్, ఖాదర్, కాలనీల పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు






