13-10-2025 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుహలను వరల్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ 2025 కు వచ్చిన వాలంటీర్స్ ఆదివారం సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో వరల్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయం వద్ద పది రోజులుగా హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2025ను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్ రావు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పర్యాటకశాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపులో భాగంగా 5వ రోజు పాండవుల గుహలను సందర్శించారు. వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్, క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్ రావు పాండవుల గుహల చరిత్రను వాటి ప్రాముఖ్యతను వివరించారు. పాండవుల గుహలను స్థానికుడు రావుల తిరుపతి తో పాండవుల గుహల లోని అన్ని ప్రదేశాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్ రావు, శ్రీనివాస్, డాక్టర్ కృష్ణ సూర్య కిరణ్, అటవీ శాఖ సిబ్బంది శ్రీకర్, రావుల శ్రీకాంత్ పాల్గొన్నారు.