25 April, 2026 | 5:43 PM

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం

25-04-2026 04:42 PM

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పాల్గొని గుండాల పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించి, మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మలేరియా అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదకర వ్యాధి అని, ముఖ్యంగా వర్షాకాలం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు.

మలేరియాను సమయానికి గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మలేరియాను అంతం చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2030 సంవత్సరం కల్లా మలేరియా రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందుకుగాను ప్రభుత్వం మలేరియా నిర్మూలన కోసం పలు కార్యక్రమాలు చేపడుతూ ఆ దిశగా పయనిస్తుందని అన్నారు.