16 April, 2026 | 9:39 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఘనంగా వరల్డ్ మిల్క్ కార్యక్రమం

02-06-2025 01:45 AM

కరీంనగర్, జూన్ 1 (విజయ క్రాంతి): నగరంలోని కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు సూచన మేరకు అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్, వేసవి క్రీడా శిక్షణ పొందుతునన వి ద్యార్థులకు ఉచితంగా వేడి పాలు, బిస్కెట్స్, బటర్ మిల్క్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పి శంకర్, మార్కెటింగ్ మేనేజర్ టి రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ పాలతోనే మన జీవితం ప్రారంభమవుతుందని, పాలే మనిషికి అమృతతుల్యమని అన్నారు.

కరీంనగర్ డెయిరీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా విరాజిల్లుతూ పాలు సేకరించి 24 గంటల్లోనే వినియోగదారులకు అందించే ఏకైక డెయిరీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, వాకర్స్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.