30 April, 2026 | 2:13 AM

వారెవ్వా ఆఫ్రా నిఖత్.. టెన్త్ మండల్ టాపర్

30-04-2026 01:03 AM

కేసముద్రం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో కేసముద్రం మండలంలో  కేసముద్రం స్టేషన్ ప్రభుత్వ జిల్లా పరిషత్  హై స్కూల్ విద్యార్థిని మహమ్మద్ అఫ్రా నిక్ఖత్ 566/600 మార్కులతో ఉత్తీర్ణురాలై మండల టాపర్ గా నిలిచిందని హెడ్మాస్టర్ బి. రాజు తెలిపారు. అలాగే కేసముద్రం స్టేషన్ హై స్కూల్ 100 శాతం ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిందని, 500 పైగా మార్కులకు పైగా పాఠశాల నుండి ఏడుగురు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. మండల టాపర్గా నిలిచిన ఆఫ్రా నిఖత్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రాజు, ఉపాధ్యాయులు  శ్రీనివాస్, నరసింహారెడ్డి, మదన్మోహన్, ముదిగిరి సదయ్య, సురేష్, ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ పాల్గొన్నారు.