10-10-2025 01:25:20 AM
ముంబై,అక్టోబర్ 9: మహిళల క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ వేలం వచ్చే నెలలో జరగబోతోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 25 లేదా 29న డబ్ల్యూపీఎల్ వేలాన్ని నిర్వహించనున్నారు.వేలానికి ముందే ప్రతీ ఫ్రాంచైజీ ఐదుగురిని అట్టిపెట్టుకోవచ్చు.
వీరిలో ముగ్గురు భారత క్రికెటర్లు,ఇద్దరు విదేశీ ప్లేయర్స్ ఉండాలి.ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో పురుషుల ఐపీఎల్ తరహాలోనే రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ప్రతీ ఫ్రాంచైజీ ఐదు ఆర్టీఎమ్స్‌లో పాల్గొనవచ్చు. ఇక ప్రతీ ఫ్రాంచైజీ వేలంలో గరిష్టంగా రూ.15 కోట్లు వెచ్చించేందుకు వీలుంది.ఒకవేళ ఐదుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకుంటే ఆ ఫ్రాంచైజీ పర్స్ నుంచి రూ.9.75 కోట్లు తీసేస్తారు.