10-10-2025 01:28:48 AM
సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి
రిఛాఘోష్ పోరాటం వృథా డిక్లెర్క్,ట్రియోన్ ఆల్‌రౌండ్ షో
విశాఖపట్నం,అక్టోబర్ 9: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి.. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్ , దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిం ది. విశాఖ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. సఫారీ ఆల్ రౌండర్లు అదరగొట్టిన వేళ భారత్‌కు విజయం అందినట్టే అంది చేజారింది. ఈ మ్యాచ్‌లో భారత్ కీలక బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు.
ఓపెనర్లు ప్రతీకా(37),స్మృతి(29) తొలి వికెట్‌కు 55 రన్స్ జోడించి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. కానీ తర్వాత హర్మన్ ప్రీత్(9), దీప్తిశర్మ(4),రోడ్రిగ్స్(0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ కేవలం 19 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిఛా ఘోష్ క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. రిఛా ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి.
జట్టు స్కోరు కనీ సం 150 కూడా చేరుతుందా అన్న అనుమానాలు నెలకొన్న వేళ 251 రన్స్‌కు చేరిం దంటే రిచా బ్యాటింగే కారణం. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ బ్రిట్స్(0), లూస్(5), బోస్చ్(1),కాప్(20), జఫ్తా(14) త్వరగానే వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్ వా ల్వార్ట్ మాత్రం పోరాడింది. ట్రియో న్‌తో కలిసి జట్టును ఆదుకుంది.
వా ల్వార్ట్ 70 రన్స్‌కు ఔటైన తర్వాత ట్రియోన్ , డిక్లెర్క్‌తో కలిసి అద్భుతంగా పోరాడింది. వీరిద్ద రూ ఏడో వికెట్‌కు 61 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. చివరి 5 ఓవర్లలో మ్యాచ్ మలు పు తిరిగింది. ట్రియోన్ 49 రన్స్‌కు ఔటైనప్పటకీ డిక్లెర్క్ భారీ షాట్లతో విరుచుకు పడింది. కేవలం 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించింది. ఆమె మెరుపులతో సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో టార్గెట్‌ను అం దుకుంది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2, స్నేహ రాణా 2, అమన్‌జోత్, శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్కోర్
భారత్ ఇన్నింగ్స్ 251 ఆలౌట్ ( రిఛా ఘోష్ 94, ప్రతీకా 37, స్నేహరాణా 33; ట్రియోన్ 3/32, కాప్ 2/45, మబా 2/46 )
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 252/7 (48.5 ఓవర్లలో) ( డిక్లెర్క్ 84, వాల్వార్ట్ 70, ట్రియోన్ 49 ; క్రాంతి గౌడ్ 2/59, స్నేహరాణా 2/49,
శ్రీచరణి 1/37 )