calender_icon.png 10 October, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర సృష్టించిన భారత్

10-10-2025 01:24:01 AM

బీడబ్ల్యూఎఫ్ జూ.చాంపియన్‌షిప్‌లో మెడల్

గుహావటి,అక్టోబర్ 9: బీడబ్ల్యూఎఫ్ జూ నియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో తొలిసారి మెడల్ ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన దక్షిణకొరియాను ఓడించింది. 3 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 44 30,45 స్కోరుతో కొరియాకు షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు అద్భుతం చేసిందనే చెప్పాలి.

తొలి సెట్ కోల్పోయి వెనుకబడినప్పటకీ... ఏమాత్రం నిరాశ చెందకుండా వరుస సెట్లను గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం కాంస్యం పతకం దక్కుతుంది. సెమీస్‌లో భారత్, ఇండోనేషియాతో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఇండో నేషియా 45 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించింది. ఇండోనేషియాపై గెలిచి ఫైనల్‌కు చేరితే స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది.