ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్
సికింద్రాబాద్,ఆగస్టు26 (విజయక్రాంతి): మత సామరస్యం,పరస్పర గౌరవం,ఐక్యతను మరింత బలోపేతం చేయడమే సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.న్యూ బోయినపల్లి పెన్షన్లైన్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, ఎమ్మెల్యే శ్రీ గణేష్,ముప్పిడి మధుకర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచం నాలుమూలల ముస్లిం సోదరులు ఈ జన్మదినోత్సవన్నీ ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో షకీబ్ హుస్సేన్, సీరాజ్,అమీర్,మౌలా, బలవంత్ రెడ్డి,మారుతి గౌడ్,ముస్లిం మత పెద్దలు, పార్టీ కార్యకర్తలు, యువకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.






