12 August, 2026 | 2:20 AM

నవభారత యువభేరికి 13 ఏళ్లు

12-08-2026 12:35 AM
  1. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): భారతదేశ గతిని మలుపు తిప్పి, దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిన చారిత్రక ఘట్టమైన ‘నవభారత యువభేరి’కి నేటితో 13 ఏళ్లు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేస్తూ మంగళవారం ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధాని అభ్యర్థిగా నియమితులైన తర్వాత.. మోదీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘నవభారత యువభేరి’ సభ జరిగిందని తెలిపారు.

సరిగ్గా ఇదేరోజు (11 ఆగస్టు, 2013) ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన దృశ్యాలు ఇవాళ్టికీ కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయన్నారు. తొలిసారిగా డెలిగేషన్ ఫీజును చెల్లించి మరీ లక్షలాదిమంది ఎల్బీ స్టేడియానికి తరలివచ్చి మోదీకి ప్రజలు సంపూర్ణ మద్దతును తెలియజేశారన్నారు. నాడు హైదరాబాద్ వేదికగా పడిన మోదీ తొలి అడుగు తర్వాత.. దేశ రాజకీయాల్లో బీజేపీ సంచలన విజయాలతో దూసుకుపోయిందన్నారు.