అంబేద్కర్ భవన్‌లో యోగా దినోత్సవం
22-06-2026 12:00 AM
నిర్మల్ జూన్ 21 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివా రం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ యోగ వేడుకలలో భాగంగా యోగా శిక్షకులు, ప్రతి యోగాసనం యొక్క ఉపయో గం తెలుపుతూ కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ రకాల యోగాసనాలు వేయించారు.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో డిఇఓ భోజన్న, డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, నోడల్ అధికారి సత్యనారాయణరావు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షకు లు, పట్టణవాసులు, పాల్గొన్నారు.






