22 June, 2026 | 3:03 AM

ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి

22-06-2026 12:00 AM

-సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్

శేరిలింగంపల్లి,జూన్ 21 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం సీపీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించరు. ‘యోగ ఫర్ వెల్నెస్, రెడీనెస్ రెసిలియన్స్‘థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్,(ఐపీఎస్)తోపాటు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్తో పాటు సుమారు 250 మంది పోలీసు అధికారులు, సిబ్బంది యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ డా.ఎం. రమేష్ మాట్లాడుతూ..యోగా భారతీయ నాగరికతకు అమూల్య వారసత్వమని, శారీరక మానసిక ఆరోగ్యానికి ఉత్తమమని తెలిపారు. పోలీసు విధుల్లో ఒత్తిడిని అధిగమించి, సమర్థవంతమైన సేవ చేయడానికి ప్రతి అధికారి తన దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.