22 June, 2026 | 2:03 AM

ఆరోగ్య జీవనశైలికి యోగా సాధనం

22-06-2026 12:48 AM

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్‌నగర్, జూన్ 21 (విజయక్రాం తి): ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే అమూల్యమైన సాధనమని, నిత్య జీవితంలో యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పురస్కరించుకొని హఠయోగా ఆశ్రమ నిర్వాహకుడు శంకరాచారి ఆధ్వర్యంలో జవహర్నగర్లో ఆదివారం యోగా దినోత్సవ వేడుకులు అంగరంగవైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఉరుకులు, పరుగుల జీవితంలో మనషులు శారీరంపై శ్రద్ధ వదిలేస్తారని, రకరకాల రోగాలు జీవితాన్ని నాశనం చేస్తున్నాయని తెలిపారు. మనషి చురకత్తిలా మారాలంటే మనసును, శరీరాన్ని ఏకం యోగానే పరమౌషధమన్నారు. అనంతరం యోగా గురు వు శంకరాచారి చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. కార్యక్రమంలో మా జీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ మేయర్లు శాంతికోటేష్, మేకల కావ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సదానందం, బీసీ సంఘాల ఛైర్మన్ గణేషాచారి, హఠ యోగా ఆశ్రమ సభ్యులు  పాల్గొన్నారు.

ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్‌లో యోగా డే..

మేడిపల్లి, జూన్ 21 (విజయక్రాంతి): అం తర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు ఆవరణలో ఆదివారం యోగా డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జూనియర్ న్యాయమూర్తి ముకేష్, రెండవ అదనపు జూనియర్ న్యాయమూర్తి వీరన్న, కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆరోగ్యకర జీవనానికి పునాది యోగా..

సికింద్రాబాద్, జూన్21 (విజయక్రాంతి):  యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని  సికింద్రాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిరాం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం  సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ నందు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ఇది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, క్రీడాకారులతో  కలిసి యోగాసనాలు నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నందకిషోర్ గోకుల్, వివిధ విభాగాల అధికారులు, యువత, క్రీడాకారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యోగ ద్వారా మానసిక ప్రశాంతత సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్ డీఐజీ పి.డాక్టర్ వీర్రాజు                  

జవహర్ నగర్, జూన్ 21 (విజయక్రాం తి): యోగ ద్వారానే  మానసిక ప్రశాంతత పొందవచ్చునని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ డి ఐ జి పి డాక్టర్ వీర్రాజు పేర్కొన్నారు. మల్కాజ్గిరి జవహర్ నగర్ సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలలో సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ( డిఐజిపి) డాక్టర్ వీర్రాజు హాజరయ్యారు. యోగ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని తెలిపారు. ప్రపంచంలో ఒక్క యోగాకే ఏ వ్యాధినైనా నయం చేసే శక్తి ఉందన్నారు.  కార్యక్రమంలో రంగారెడ్డి డిఐజి ఆర్కే శర్మ, మెడికల్ డిఐజి జనార్దన్, ఉపాధ్యాయ డిప్యూటీ కమాండెంట్  మనీష్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ రాజేంద్రప్రసాద్ తోపాటు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.