29 July, 2026 | 1:06 AM

నెల 15 రోజులైనా దుస్తులు అందించరా..

29-07-2026 12:00 AM

అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం..

తాడ్వాయి,జూలై, 28( విజయ క్రాంతి ): పాఠశాలలు ప్రారంభమై నెల 15 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా విద్యార్థులకు దుస్తులు అందించరా అంటూ ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దుస్తులు ఇప్పటికీ అందించకుంటే ఎలా అని ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కన్కల్ సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... దుస్తులు 15 ఆగస్టు కు అందిస్తారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.కరెంట్ సమస్యలపై అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోరన్నారు. 

ఎంపీడీవో భరత్ కుమార్ మాట్లాడుతూ... ఎలినినో ప్రభావం ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేకంగా జలసిరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. సర్పంచులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో ఇంటింటికి ఇంకుడు గుంతలు,గ్రామాలలో కమ్యూనిటీ సోప్ పిట్స్, బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాలలో పాం ఫండ్స్, ఓపెన్ వెల్స్, రూప్ వాటర్ స్టోర్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వర్షపు ప్రతి నీటి బొట్టును వృధా కానివ్వకుండా జాగ్రత్తగా భూమిలోనికి ఇంకిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏవో నర్సింలు మాట్లాడుతూ.. రైతులందరికీ సరిపోయేలా యూరియా అందించామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం, సంబంధిత మిషన్ భగీరథ ఏఈలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో నీటి సమస్యలు ఉన్నాయని తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్, తహసిల్దార్ శ్వేత, ఎంపీ ఓ సవిత రెడ్డి, డిఈ వెంకటేష్, సర్పంచులు రవీందర్ రెడ్డి, మంగారెడ్డి, పోచయ్య, తాజోద్దీన్, రాజాగౌడ్, నర్సింలు, వినోద తదితరులు పాల్గొన్నారు.