calender_icon.png 5 February, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి

05-02-2026 12:00:00 AM

చిట్యాల, ఫిబ్రవరి 4 :  ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుటకు అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను కోరారు. బుధవారం చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని వివరిస్తూ,  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వారి యొక్క గుర్తింపు కార్డులను వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల దగ్గర తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే ప్రచారానికి ఉపయోగించే వాహనానికి అనుమతి  మున్సిపల్ కమిషనర్ ద్వారా, మైక్ ను వినియోగించుటకు అనుమతి  డిఎస్పి ద్వారా తీసుకోవాల్సిందిగా అభ్యర్థులకు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుటకు అందరి సహకారం అందించవలసిందిగా కోరారు. కౌంటింగ్ సెంటర్ రూమ్ నెంబర్ 1001  తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ గరల్స్ కాలేజ్ నల్లగొండ యందు నిర్వహించబడునని తెలిపారు. ఈ సమావేశంలో  ఆర్వోలు ఏఆర్వోలు మొదలగు వారు పాల్గొన్నారు.