30 July, 2026 | 5:47 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

వృత్తి నిబద్ధతతో పనిచేయాలి

03-01-2026 06:20 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): వృత్తి నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు గుర్తింపు తెచ్చే విధంగా పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్పీసీ లుగా విధులు నిర్వహిస్తూ, ఇటీవల హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన అధికారులు మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ జిల్లాకు కేటాయించబడిన అధికారులు: టి. సురేంద్ర బాబు, ఎ. నరేందర్, ఎం.జియ్యుద్దీన్, ఎం. విద్యాసాగర్ రెడ్డి, టి. దామోదర్, ఎం. ఇంకేశఫ్ అలీ ఉన్నారు.