03-01-2026 06:16:52 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వెంకటేశ్వర ఆలయం,పాఠశాలలకు, పేదలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులు బెజ్జారపు కొండ స్వామి పెళ్లి రోజు పురస్కరించుకొని వారి సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెకండ్ డిస్టిక్ వైస్ గవర్నర్ గుంటుక ప్రకాష్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అత్యధిక సేవలు చేస్తుందని వారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అధ్యక్షులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అన్న ప్రసాదము, ప్రభుత్వ స్కూళ్లలో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు ఆలయాల్లో అల్పాహార కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.