24 May, 2026 | 6:00 AM

శ్రద్ధతో చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి

11-09-2025 12:00 AM

మాజీ మంత్రి మల్లారెడ్డి 

మేడ్చల్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): విద్యార్థులు శ్రద్ధతో చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి పాలిటి పరిధిలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ అల్లాయిడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓరియంటేషన్ డే 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు విదేశా ల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు తమ ప్రయాణా న్ని ఉత్తమంగా తీర్చిది ద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భద్ర రెడ్డి, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.