calender_icon.png 11 September, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐలమ్మ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లపై పోరాడుదాం

11-09-2025 12:00:00 AM

బీసీ  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఘన నివాళి

తాండూరు, 10 ఆగస్టు, (విజయ క్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందారుల అనుచరులకు ఎదురొడ్డి రైతాంగా నికి, మహిళలకు ధైర్యాన్ని నూరిపోసిన దీరవనిత చాకలి ఐలమ్మ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యు లు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తాం డూరు పట్టణంలో  ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

చాకలి ఐల మ్మ ఆత్మవిశ్వాసం ఈనాటి బీసీ సమాజానికి దారి చూపుతోందని ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే బీసీలకు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం సాధ్యమవుతుందని  హైదరా బాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం నాయకులు  గడ్డం వెంకటేష్, బసవరాజ్  రాము  మంతటి రాజు  అనిల్ కుమార్, చాకలి బిచప్ప, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ ,విగ్నేష్, హరికృష్ణ ,మల్లేష్, వివేక్ దాస్  తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌లో.. 

మేడ్చల్, సెప్టెంబర్ 10(విజయ క్రాంతి): చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పిం చారు. రైల్వే స్టేషన్ రోడ్డులో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు.  వేముల శ్రీనివాసరెడ్డి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. చాకలి ఐలమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టిందన్నారు. సింగరేణి పోచయ్య, దేవరాజ్, సద్ది సుదర్శన్ రెడ్డి, దుర్గమ్మ వెంకటేష్ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, టైలర్ రాజు, రంజిత్ రెడ్డి, వైభవ్, సతీష్, రాందాస్  పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.

చాకలి ఐలమ్మ యాదిలో.. 

చేవెళ్ల, సెప్టెంబర్ 10: చేవెళ్ల పట్టణ కేంద్రంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అత్తెల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ, తెలం గాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొర లు, భూస్వాములను ఎదిరించిన ఐలమ్మ గొప్ప ధైర్యశాలి అని కొనియాడారు.  స్టేట్ ఎండో సెల్ వెంకట్ రామ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి అశోక్, బీజేవైఎం మండల జనరల్ సెక్రెటరీ మధుకర్ రెడ్డి, నాయకులు చాకలి శ్రీనివాస్, వడ్డే గణేష్, అభిలాష్, బాబు, భార్గవ్ రెడ్డి, బొజ్జ రఘునాథ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జైసింహ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

యాచారం.. 

యాచారం సెప్టెంబర్ 10 : చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజ య్య అన్నారు. ధర్మన్న గూడెం  గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40 వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపార. అనంతరం పి.అంజయ్య మాట్లాడుతూ. సాయూదా పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో  జరిగింది  4000 వేల మంది ప్రాణాలు కోల్పోయి.

3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల  ఎకరాల భూమి పంచి గ్రామ స్వరాజ్యలు ఏర్పాటు చేసిన చరిత్ర  పెట్టి చాకిరీకి వ్యతిరేకంగా  దున్నే వాడికి భూమి దక్కాలని  సాగిన తెలంగాణ సాయూదా రైతంగా  పోరాటంలో  విసునూ ర్ దేశముఖ్  రామచంద్ర రెడ్డి ఆగడా లకు రజాకార్లకు పోరాడిన విరవనీత అని కొనియాడారు. పి రమేష్, తాజా మాజీ సర్పంచి ఎం భాషయ్య, నాయకులు ఎ రాములు  ఎన్  సత్తయ్య, ఎం సత్తయ్య  జె హన్మంతు రామారావు  గోపాల కృష్ణ శ్రీశైలం, నవీన్ ,రామకృష్ణ  ,కోటయ్య  దీక్షిత్ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం..

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 10: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని వెనుకబ డిన తరగతుల సంక్షే మ శాఖ కార్యాలయం లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీ త ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.   బీసీ వెల్ఫేర్ అధికారి కేషురామ్, వివిధ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ

ఘట్ కేసర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ ఆశయసాధన కోసం పోరాడా లని సీపీఎం జిల్లా నాయకులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి ఎన్. సబిత పిలుపునిచ్చారు. బుధవారం పోచారం మున్సిపల్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీ అంబేడ్కర్ విగ్రహం వద్ద చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

 మట్టి మనుషులను ఒక్కటి చేసి మహయెాధులుగా తీర్చిదిద్ది బాంచన్ దొరా నీ కాల్ మొక్త అన్న పేద జనాన్ని గడప దాటని స్త్రీలను వీధుల్లో పోరాడే దశకు చేర్చిందన్నారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకురాలు చల్లగొండ అరుణ, కె. భారతి, జి. వాణి, పార్వతి, అలివేలు, మంగ, ఐలమ్మ, ప్రేమలత, మంజుల, వాణి, శాంతమ్మ , కళావతి, లక్ష్మణ్, ఎల్లమ్మ,   యశోద, హేమలత పాల్గొన్నారు.