calender_icon.png 11 September, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిషత్ ఓటర్ల తుది జాబితా విడుదల

11-09-2025 12:00:00 AM

కరీంనగర్, సెప్టెంబరు 10 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాకు సంబంధించి మండల పరిషత్ ఓటర్ల తుది జాబితాను బుధవారం సాయంత్రం అదనపు ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో శ్రీనివాస్ విడుదల చేశారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా, 170 ఎం పీటీసీ స్థానాలు ఉన్నాయి.

మొత్తం ఓటర్లు 5,07,531 కాగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 934. జిల్లాలో చిగురుమామిడి ఎంపీపీ పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇల్లం దకుంటలో 9 ఎంపీటీసీ స్థానాలు, గంగాధర మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, గన్నేరువరంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. హుజూరాబాద్లో 12 ఎంపీటీసీ స్థానాలు, జమ్మికుంటలో 10 ఎంపీటీసీ స్థానాలు, కరీంనగర్ రూరల్ లో 17 ఎంపీటీసీ స్థానాలు, కొత్తపల్లిలో 5 ఎంపీటీసీ స్థానాలు, మానకొండూల్లో 19, రామడుగులో 14, శంకరపట్నంలో 13, తిమ్మాపూర్లో 12, వీణవంకలో 14, చొప్పదండిలో 11, సైదాపూర్లో 12 ఎంపీటీసీ స్థానాలుఉన్నాయి.