19-08-2025 06:59:42 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన సూర దినేష్ అనే యువకుడు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు బెల్లంపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్నతనంలోనే సూర దినేష్ గుండెపోటుతో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.