calender_icon.png 1 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్

01-11-2025 12:00:00 AM

ఎస్పీ శరత్ చంద్ర పవర్ 

నల్లగొండ క్రైం, అక్టోబర్ 31: జాతీయ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శుక్రవారం పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ, 2కె రన్ ప్రారంభించి మాట్లాడారు.

దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశ భక్తుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ అన్నారు భారత దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి, 550 కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయుటకు దృడ సంకల్పంతో ఏలాంటి వత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ అన్నారు.   

అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్ రెడ్డి, మహా లక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, శ్రీను నాయక్, రఘువీర్ రెడ్డి ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్త్స్రలు సైదులు, గోపాల్‌రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో..

కోదాడ అక్టోబర్ 31: జాతీయ సమైక్యతకు పాటుపడిన మహోన్నత వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ర్యాలీనీ ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో జాతీయ భావా లు, దేశ భక్తి నీ  పెంపొందించేందుకు జిల్లా పోలీసుశాఖ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్య తకు బలమైన స్ఫూర్తినిచ్చారన్నారు.  కాగా యువకులు, విద్యార్థులు భారీగా ర్యాలీ లో పాల్గొన్నారు.  విద్యార్థులు జై హింద్, వందే మాతరం నినాదాలతో పటేల్ స్ఫూర్తిని ప్రతిధ్వనింపజేశారు. ఆర్డీవో సూర్యనారాయణ, పట్టణ సీఐ శివశంకర్, ఎంఈఓ సలీం షరీఫ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఎస్త్స్రలు హనుమాన్ నాయక్, పులి వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో.. 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 ( విజయక్రాంతి): భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, పాశం భాస్కర్‌లు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.

యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో ఐక్యత మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ నిజాం నిరంకుశత్వ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన నాయకుడు వల్లభాయ్ పటేల్ అని అన్నారు.  సీనియర్ నాయకులు పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, కాదూరి అచ్చయ్య, మాయ దశరథ, గూడూ రు నరోత్తమ రెడ్డి, పాదరాజు ఉమా శంకర్రావు, పట్నం శ్రీనివాస్,

వేముల నరేష్,  మంగు నరసింహారావు, తోట రామకృష్ణ, లక్ష్మీనారాయణ, కోటేష్, మొహ మ్మద్, సదానందం గౌడ్, శ్రీధర్‌రెడ్డి, సురేష్ రెడ్డి, వినోద్, జాదవ్ లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గంగేష్ కుమార్, స్వామి, సతీష్, శేఖర్ రెడ్డి,  శ్రీను, పాండు,  క్రాంతి, రమేష్, సిద్ధులు, శేఖర్ మల్లికార్జున్ బాల శంకర్ రాజు, ప్రవీణ్, వంశీ, ఉషాకిరణ్, గురువు శేఖర్ రెడ్డి,  పాండురంగ రెడ్డి పాల్గొన్నారు.

ఐక్యతను చాటేందుకే.. 

మిర్యాలగూడ, అక్టోబర్ 31 (విజయ క్రాంతి):  ఐక్యతను చాటెందుకే ఏక్తా దివాస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మిర్యాలగూడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కే.రాజశేఖర్ రాజు అన్నారు. భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతి ఐక్యత దినోత్సవాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  భారీ ర్యాలీ నిర్వహించి ‘రన్ ఫర్ యూనిటీ‘- సర్దార్ @150 పేరుతో 2కే రన్ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉద్యోగులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో  నిర్వహించారు.  సాగర్  ప్ర ధాన రహదారిపై మానవహారం నిర్వహించారు. జాతీయ జెండాను చేత భూమి  జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా నినాదాలు చేశారు.  పట్టణ సిఐలు నాగభూషణరావు, సోమ నరసయ్య, ఎస్త్స్రలు రాంబాబు సైదిరెడ్డి,  రైటర్లు రాజా రామ్ నాయక్, వీరబాబు,నరసింహ, గఫార్, సిబ్బంది పాల్గొన్నారు.

మిర్యాలగూడ మండలం అవంతిపురం లోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులచే మిర్యాలగూడ రూరల్ సీఐ పి ఎన్ డి  ప్రసాద్,  మిర్యాలగూడ గ్రామీణ ఎస్త్స్ర లక్ష్మయ్యల ఆధ్వర్యంలో 2కె రన్  నిర్వహించారు.  ఏఎస్‌ఐ రాములునాయక్, రైటర్ సైదా నాయక్,శ్రీనివాస్, కానిస్టేబుళ్లు  మహేష్, అరుణ, ఉష, నాగయ్య, సైదులు. కొండల్ పాల్గొన్నారు.

పౌరుల ఐక్యమత్యం కోసమే రన్ ఫర్ యూనిటీ

సూర్యాపేట, అక్టోబర్ 31 (విజయ క్రాంతి) : పౌరులలో ఐక్యమత్యాన్ని పెంపొం దించేందుకే రన్ ఫర్ యూనిటీ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్క రించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం, పోలీసు అమరవీరుల వారోత్సవాలు ము గింపు సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ చౌరస్తా నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన రన్ పర్ యూనిటీని ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. 

దేశ సమగ్రత, దేశ భద్రత, దేశ ఐక్య మత్యాన్ని చాటడంలో యువత ముందుం డాలన్నారు. తదుపరి ఎస్పీ నర్సింహా మాట్లా డుతూ  యువత సన్మా ర్గంలో నడవాలని, సత్ప్రవర్తతో ఉండాలని దృఢమైన ఐక మత్యం గల భారతదేశ నిర్మాణంలో భాగ స్వాములు కావాలని కోరారు.   

డిసిఆర్బి డిఎస్పి రవి, ఆర్టీఏ అధికారి జయప్రకాష్ రెడ్డి, జిల్లా ఫైర్ అధికారి కృష్ణా రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, జైల్ సూపరింటెండెంట్ సుధాకర్, ఎక్సైజ్ సర్కిల్ అధికారి మల్లయ్య, ఫైర్ స్టేషన్ ఎస్త్స్ర జానయ్య, పట్టణ ఎస్త్స్రలు, సాయిరాం, మహేందర్ నాథ్, శివతేజ, అర్సుసైలు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

చండూరు, అక్టోబర్ 31 : కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని చండూరు సిఐ ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం చండూరు పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చండూరుపోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు సిఐ ఆదిరెడ్డి  హాజరయ్యారు.

డాన్ బాస్కో కాలేజ్ నుండి 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పట్టణ పోలీసులు, విద్యార్థులు, యువతతో పాటు, వాకర్స్  ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో చండూరు ఎస్ ఐ ఎన్.వెంకన్న, డాన్ బాస్కో కాలేజ్ కరస్పాండెంట్ డాక్టర్ విల్సన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.