11-07-2025 12:11:23 AM
గంభీరావుపేట క్రైమ్, జూలై 10 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గంభీరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ (25) అనే యువకుడు ఉద్యోగం కోసం గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు.
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై బుదవారం రాత్రి స్వగ్రామమైన నర్మలకు వచ్చిన అతను, గ్రామ శివారులోని స్వంత పొలంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడం వల్ల జీవితంపై విరక్తి చెంది, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి లోకం మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక ఎస్‌ఐ రమాకాంత్‌తెలిపారు.