11-07-2025 12:09:59 AM
కరీంనగర్ క్రైం, జూలై 10 (విజయ క్రాంతి): కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి స్టేషన్ లో నమోదైన కే సులో అఘోరీ శ్రీనివాస్ ను గురువారం కో ర్టులో హాజరు పరిచారు. ఇటీవల ఎల్లారి శ్రీ నివాస్ అలియాస్ అఘో రీ శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే స మయంలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
2024 నవంబర్21న బా ధితురాలిని ట్రాప్ చేసి కిడ్నాప్ కు పాల్పడ్డ శ్రీనివాస్ ఆ తరువాత కొండగట్టు ఆలయం లో ఆమె మెడలో పవిత్ర దారం కట్టారని కే సు నమోదు అయింది. ఈ కేసులో శ్రీనివా స్‌ను గురువారం కరీంనగర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అనంతరం హైద రాబాద్ చంచల్ గూడ జైలుకుతరలించారు.