11-07-2025 12:12:29 AM
మహబూబ్‌నగర్ జూలై 10 (విజయ క్రాంతి) : గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రానికి సమీపంలోని వీరన్న ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయా న్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో డీఎఫ్‌ఓ సత్యనారాయణ చిరుత సంచరించిన ప్రాంతంలో ప్రత్యేక బోనును ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఏర్పాటు చేసిన బోను లో చిరుత చిక్కింది. బోనులో గొర్రె పిల్లను అందుబాటులో ఉంచి చిరుత బోన్ లోకి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో ఒకసారి అబ్బో కి చూస్తా చేరుకో వడంతో చిత్తపురిని అటవీశాఖ అధికారులు నిర్బంధించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.