06-10-2025 05:56:20 PM
మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని, అన్ని గ్రామాలు, మండల, నియోజకవర్గాల్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరావేయాలని యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడి పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ జెండా చేతబట్టి రాత్రనక, పగలనక పనిచేసి ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన యువజన కాంగ్రెస్ నాయకులకు త్వరలో జరగబోయే ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలలో అవకాశం కల్పించాలని కోరారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసి స్థానాలలో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలనీ రాష్ట్ర యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి, రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ లను, నియోజకవర్గ, మండల అధ్యక్షులను, నాయకులను కోరారు.