calender_icon.png 6 October, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం

06-10-2025 07:37:19 PM

ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్

చౌటుప్పల్ (విజయక్రాంతి): చౌటుప్పల్ మండలంలోని కుంట్ల గూడెం గ్రామానికి చెందిన చిల్లపల్లి రవి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ప్రతి నెల వైద్య ఖర్చుల నిమిత్తం మెడిసిన్ కోసం 25 వేలకు పైగా ఖర్చు అవుతుందని ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ తెలియపరచడం జరిగింది. వెంటనే పేదవాళ్లకు ఏ ఆపద వచ్చిన నేను తోడుగా ఉంటానని వెంటనే వైద్య ఖర్చు నిమిత్తం రెండు నెలలకు సరిపడా 50 వేల రూపాయల ఖరీదు గల మెడిసిన్ ఈ ఎల్ వి భాస్కర్ పౌండేషన్ సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు బండమీది కిరణ్ కుమార్, బండమీది రాజు, సునీల్, విక్రమ్, నరేష్, రాఘవేంద్ర, ప్రదీప్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.