06-10-2025 07:48:11 PM
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు విజయ్ దేవకొండకు సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. తాను ప్రయాణిస్తున్న కారును బొలోరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన జోగులాంట గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడగా, ఆయన కారు స్పల్పంగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ స్నేహితులతో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించకొని, తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదంలో సంభవించింది. విజయ్ తన కారు దిగి స్నేహితుడి కారులో వెళ్లిపోయారు. ఈ మేరకు నటుడి కారును ఢీకొట్టిన వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా.. ఇటీవల విజయ్ దేవరకొండకు నటి రష్మిక మందనతో నిశ్చితార్థం జరిగినట్లు వార్తాలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగిందని, అందుకే విజయ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.