13-01-2026 02:23:24 AM
సీఎం రేవంత్‌రెడ్డికి టీఎన్జీవో ప్రత్యేక ధన్యవాదాలు
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) కేంద్ర సంఘం, హైదరాబాద్ జిల్లా యూనియన్ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మార్వం జగదీశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా డీఏ పెంపును ప్రకటించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్), టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఈ డీఏ పెంపు పట్ల తమ సంతోషాన్ని ప్రకటించారు.