calender_icon.png 2 August, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక మాఫియా దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

01-08-2025 10:50:22 PM

చారకొండ: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడనే నెపంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి సాయికుమార్ పై ఇసుక మాఫియా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) చారకొండ మండలం గోకారం గ్రామంలో చోటుచేసుకుంది. గోకారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి గ్రామంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లు వేగంగా వెళుతున్నాయని మూగ జీవాలకు తగులుతున్నాయని, నెమ్మదిగా వెళ్ళమని చెప్పడంతో చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ శివ శంకర్ విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడు తెలిపారు. అనుమతుల పేరుతో ఇతర మండలాలకు అక్రమ ఇసుకను రవాణా చేస్తున్నారని ప్రశ్నించిన గ్రామస్తులను దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దాడిపై సాయికుమార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.