calender_icon.png 2 August, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలి

02-08-2025 12:00:00 AM

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య

అదిలాబాద్, ఆగస్టు 1 (విజయ క్రాంతి):  కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిరుద్యోగులను ఉపాధికి దూరం చేస్తోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ... మూతపడిన సిమెంట్ పరిశ్రమను తిరిగి తెరిపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకునేలా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చట్టం తేవాలని పేర్కొన్నారు. ప్రేమ సేవ, నాలెడ్జ్ పవర్, ఎడ్యూకేషన్ సెల్యూషన్ ఆ అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్ట్ జడ్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సత్కరించారు.

అదిమ సమాజం నుంచి ఆధునాత సమాజానికి నాలెడ్జ్ పవర్ అనే అంశాన్ని ఏకీభవించకుండ ఉండని వారే లేరని అన్నారు. ప్రతి జీవితో సేవ, ప్రేమ స్వభావాలుంటాయని తెలిపారు. న్యాయవాదులు వారి ఆలోచనలకు పదునుపెడుతూనే పలు అంశాల వైపు దృష్టి సారించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి  శివరాం ప్రసాద్, న్యాయమూర్తులు హుస్సే న్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.