calender_icon.png 26 July, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి

26-07-2025 12:17:38 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి పై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేబి చౌక్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ షాప్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టెక్నికల్ రంగంలో రాణించేందుకు యువత ఆసక్తి చూపాలని అన్నారు.టెక్నికల్ వర్క్ నేర్చుకుంటే ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు.