calender_icon.png 26 July, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం కోసం వచ్చే రోగులను ఇబ్బందులకు గురి చేయెద్దు

26-07-2025 12:19:34 AM

  1. శంషాబాద్ ప్రభుత్వ దావఖానను ఆకస్మికంగా 

తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సీ. నారాయణరెడ్డి 

రంగారెడ్డి, జులై 25 (విజయ క్రాంతి): వైద్యం కోసం వచ్చే రోగులను ఎక్కడ ఇబ్బందులకు గురి చేయకుండా వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆ దేశించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ చేపట్టాలని, రోగులకు అ వసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు.

శు క్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కమ్యూనిటి ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలో రోగులకు అం దిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి సరిపడా వైద్య సిబ్బంది ఉ న్నారా? లేదా ? అని అక్కడి మెడికల్ ఆఫీసర్ ను అడిగారు. సిబ్బంది అవసరమైతే తనకు తెలి యజేయాలన్నారు.

హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు. సి.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్ ను వివ రాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండాలని, సీజ నల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రికి రోజు ఎంతమంది అవుట్ పేషంట్, ఇన్ పేషెంట్లు వస్తుంటారని డాక్టర్ ను ప్రశ్నించారు.

ఆస్పత్రిలోని అన్ని వార్డులను సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండ వారం రోజుల్లో చ ర్యలు తీసుకొని శుభ్రంగా ఉంచాలని తెలిపారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్లో డయాలసిస్ పే షంట్లకు అవసరమైన నీరు అందించుటకు ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి మెడికల్ ఆఫీసర్ తీసుకొని వచ్చారు.

అందుకు కలెక్టర్ స్పందిస్తూ వారం రోజుల్లో నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం వైద్యం, విద్య పై ప్రత్యేక దృష్టి పెట్టినందున ప్రభుత్వ అంచనాలకు తగిన విధంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీహెచ్ సీ వైద్యాధికారి దుర్గలత, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, పాల్గొన్నారు.