26-07-2025 12:17:29 AM
మేడ్చల్ అర్బన్, జూలై 25:వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు. తెలంగాణ రైసింగ్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శు క్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మహిళ సంఘ సభ్యులకు, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది.
ఈ క్యాంప్ లో వివిధ రకాల రక్త పరీక్షలు, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి, షుగర్ పరీక్షలు మెప్మా ఆధ్వర్యంలో వైద్య అధికారుల బృందం పరీక్షలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచందర్,మెప్మ కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.