calender_icon.png 23 October, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాభివృద్ధికి, నేరాల నియంత్రణకు యువత పోలీస్‌తో భాగస్వాములు కావాలి

23-10-2025 12:04:30 AM

గోదావరిఖని పోలీస్ రక్తదాన శిబిరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, అక్టోబర్ 22(విజయ క్రాంతి) అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని 1-టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి , రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 1-టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్ లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, అక్టోబర్ 21 పోలీసు వారోత్సవాల సందర్భంగా ప్రజల గురించి పోలీసు ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తు కలిసి పనిచేస్తున్నారో అనేది ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రాణాలు అరిప్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసు తమ విధి నిర్వహణలో ప్రజల రక్షణతో పాటు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, పండగల సమయంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై పోలీసులు విధులను నిర్వర్తిస్తారని తెలిపారు. 

యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల లో భాగంగా కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల ను స్ఫూర్తిగా తీసుకొని యువత బాధ్యత గా వ్యవహారిస్తూ ముందుకు వచ్చి పోలీస్ కి సహకరించాలని సూచించారు.

ఈ రక్తదాన శిబిరం లో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్‌ఐ రమేష్, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1- టౌన్ ఎస్త్స్రలు రమేష్, అనూష, రామగుండం ఎస్త్స్ర సంధ్యారాణి, అంతర్గం ఎస్‌ఐ వెంకట్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రిజియాన్ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.