23-10-2025 12:03:48 AM
ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): సీజేఐ బీఆర్ గవాయ్‌పై దాడి జరిగి 15 రోజులు గడుస్తున్నా దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయక పోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ జాతీ య వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయమై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ కేసు నమోదుకు సిఫార్సు చేసినప్పటికీ, ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
సీజేఐ దళితుడు అయినందువల్లే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డా రు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. అన్ని పార్టీల ప్రతినిధులు దాడిని ఖండించారు తప్పా అరెస్టు చేయాలని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాజ్యాంగంపై, న్యాయస్థానంపై జరిగి న దాడి అని కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటాగా ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.
దాడిని ఖండి స్తూ నవంబర్ 1న బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్ర హం మీదుగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వర కు పెద్ద ఎత్తున దళితుల ఆత్మగౌరవ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని ఎవరు ప్రమాదంలో నెట్టివేసే శక్తులైనా, వ్యక్తులైనా సహించేది లేదని హెచ్చరించారు.
తాము నిర్వహించే ర్యాలీకి డీజీపీ, నగర సీపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో వీహెచ్‌పీఎస్ నాయకులు అందే రాంబాబు, ఇంజం వెంకట్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, టీవీ నరసింహం మాదిగ, ఇటుక శ్రీకర్ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, రామకృష్ణ మాదిగ, గజ్జల రాజశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.