01-07-2025 02:05:40 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రం భీం ఆసిఫాబాద్ /కాగజ్‌నగర్ జూన్ 30 (విజయక్రాంతి): యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటి ల్ సూచించారు. సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వల్ల జరిగే అనార్థాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలన లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి ,డ్రగ్స్ బారినపడి యువత జీవితాలను కోల్పోతున్నారన్నారు. మంచి లక్ష్యాలను పెట్టుకొని వాటి సహకారం దిశగా అడుగులు వేయాల ని తెలిపారు.
అలాగే బాధితులకు సత్వరన్యా యం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. సోమవారం ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డిపిఓలో ప్రజల నుంచి అర్జీలు స్వీక రించారు. ఫిర్యాదు దారులు అందజేసినఅర్జీలను పరిశీలించి చట్ట ప్రకారం పరిష్కరిం చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నా రు. అనంతరం గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ గణేష్ నాయక్ కుటుంబానికి రూ. 9 లక్షల భద్రత చెక్కును ఎస్పీ అందజేశారు.