01-07-2025 02:06:58 AM
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అత్యధిక మంది సభ్యత్వమున్న పార్టీ బీజేపీ అని.. ఒకరు చెబితేనో, మరెవరో ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణ యం తీసుకునే పార్టీ కాదనే విషయాన్ని గు ర్తుంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
రామచందర్‌రావు పేరును బీజేపీ రాష్ర్ట అధ్యక్షు డిగా ఖరారు చేయటం వెనుక చంద్రబాబు కీలకపాత్ర పోషించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా అడిగిన ప్రశ్నకు బండి స్పందించారు. ఇది కావాలనే కొంతమంది చేస్తున్న దుష్ర్పచారమని స్పష్టం చేశారు. అట్లాంటి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
బీజేపీలో పార్టీ లైన్‌ను దాటే వారిని పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉన్నట్టు, లేకపోతే పార్టీయే లేనట్టు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు. ఎవరు లేకపోయినా పార్టీ నడస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎవరైనా నామినేషన్ వేసే అవకాశముందని.. అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో కూడా తప్పులేదన్నారు.
కానీ అన్ని విషయాలను పరిగణ నలోకి తీసుకొని పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్‌మెంట్‌తో పనిచేసే ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగతా వాళ్లు డమ్మీ అనుకోవడం కూడా సరికాదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ప్రచారం చేస్తే ఊరుకోమన్నారు.