19-05-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్
సిద్దిపేట, మే 18 (విజయక్రాంతి): యువత భక్తి మార్గంలో నడవాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ సూచించారు. ఆదివారం కుకునూరు పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన హనుమాన్ వ్రత పూజలో పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త హనుమంతుని వలె పని చేయాలని అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నుపూస లాంటి వారిని, ప్రతి అభివృద్ధి పథకం అర్హులైన వారికి అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.