19-05-2025 12:00:00 AM
కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 18(విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించబోయే జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆర్&బి శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ పరిశీలనలో డిఈ ఆర్ అండ్ బి రామకృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.