calender_icon.png 9 July, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్సార్ జయంతి

09-07-2025 12:26:43 AM

కరీంనగర్, జూలై 8 (విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డిసిసి కార్యాలయంలో వైయస్సార్ చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పిసిసి ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది నాయకుల రాజకీయ మనుగడకు మార్గదర్శకులు వైయస్సార్ అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడమే కాక పార్లమెంటు సభ్యునిగా ఇందిరా గాంధీ గారి కుటుంబానికి సన్నిహితుడిగా ఈ దేశంలో గొప్ప పేరు పొందారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.

ఆ మహానేత ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో నగరంలోని సిఎస్‌ఐ చర్చిలో రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాల ని ప్రార్థనలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముల్కల ప్రవీణ్, వెన్న రాజా మల్లయ్య, గడ్డం విలాస్ రెడ్డి, పడి శెట్టి భూమయ్య, దిండిగాల మధు, చింతల కిషన్, వంగల విద్యాసాగర్, మాదాసు శ్రీనివాస్,నాగుల సతీష్,అక్బర్, తదితరులుపాల్గొన్నారు.