09-07-2025 12:27:33 AM
శిబిరాన్ని పర్యవేక్షించిన టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
ఆమనగల్లు, జూలై 8: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియగం చేసుకోవాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహిస్తున్న ఉచితకంటి వైద్య శిబిరానికి నాల్గొవరోజు నియోజకవర్గంలోని ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల నుంచి అపూర్వ స్పందన వస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కంటి సమస్యలతో ఎవరు బాధపడొద్దని ఉద్దేశంతో తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చెయ్యొద్దని ఆయన హితవు పలికారు. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు శిబిరంలో గత నాలుగు రోజుల నుం చి దాదాపు 3000 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శిచగా అందులో 2,200 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు.
అందులో 120 మందికి కంటి శుక్లాల సమస్యలు గుర్తించి వారిని ఆపరేషన్లు ఎంపిక చేసినట్లు చెప్పారు. 1300 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామ న్నారు. శిబిరం ఆదివారం వరకు కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నరేందర్ గౌడ్,యూసఫ్ బాబా,గణేష్, యాద య్య,రమేష్ నాయక్,శేఖర్,రాఘవేందర్,శ్రీపతి,శ్రీను,నాగిళ్ల శివ,కళ్యాణ్ తదితరులుపాల్గొన్నారు.