16 August, 2026 | 7:38 PM

Districts - Bhadradri Kothagude

article_55440683.webp
సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తో కలిసి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

16-08-2026

article_34943139.webp
సింగరేణి మారుపేర్ల అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష

కొత్తగూడెం ఆగస్టు 16 విజయక్రాంతి: భద్రాద్రి జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా 36 గంటలుగా కొనసాగుతున్న, ఆమరణ నిరాహార దీక్ష — లక్కా శ్రావణ్ గౌడ్ బీపీ 90/70కి పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం కొనసాగుతున్న,ఆమరణ నిరాహార దీక్ష 36 గంటలు దాటింది. దీక్షలో పాల్గొంటున్న బాధితుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీక్షలో పాల్గొంటున్న బాధితుడు,ఆకుల సాక్షిరెన్ బ్లడ్ ప్రెషర్ 80/60గా నమోదైంది. మరో ముగ్గురు బాధితుల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గినట్లు తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకున్న వైద్యుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, గ్లూకోజ్ తీసుకోవాలని, ఆహారం తీసుకోవాలని సూచించారు.

16-08-2026

article_12045240.webp
పేకాటలో ఖమ్మం మంత్రి అనుచరుల అరెస్ట్

మణుగూరు/పినపాక, ఆగష్టు 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పినపాక మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులను పేకాట ఆడుతుండగా ఆంధ్రా పోలీసులు పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన ప్రముఖ మంత్రి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అనుచరులుగా చలామణి అవుతున్న పినపాక మండలానికి చెందిన ఏడూళ్లబయ్యారం, సీతంపేట, గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మంత్రి, ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు పేకాట ఆడుతుండగా ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో ప్రత్యేక పోలీసు బృందాలకు దొరికినట్లు సమాచారం.

16-08-2026

article_51841506.webp
మహనీయుల త్యాగస్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పరదేశ పాలన నుంచి విముక్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణ సాధనను చేసేందుకు జరిపిన స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానీయులు తమ ప్రాణాలను తృణప్రాయం చేశారు. వారి త్యాగాల స్ఫూర్తిని ఆశయంగా చేసుకొని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

16-08-2026

article_25938260.webp
బుడ్డగూడెం పాఠశాలకు ఇనుప ఉయ్యాల బహూకరణ

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల పరిధిలోని బుడ్డగూడెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం దాతలు ఇనుప ఉయ్యాలను బహూకరించారు. సోడె బక్కయ్య–బాలమ్మ జ్ఞాపకార్థం వారి మనుమడు సోడె వీరభద్రం–లీలా దంపతులు శనివారం పాఠశాలకు ఇనుప ఉయ్యాలను అందజేశారు.ఆటవిడుపు సమయంలో విద్యార్థులకు ఉయ్యాల ఉపయోగకరంగా ఉంటుందని దాతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని హెచ్‌ఎం ఈశ్వర్‌ అన్నారు. దాతలను అభినందించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, నాగమణి, వార్డు సభ్యులు రవి, ఆదిలక్ష్మి, పుల్లయ్య, కొడెం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_84071850.webp
సైనికుడి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం విలేఖరులు ప్రత్యేక సందేశాన్ని చాటిచెప్పారు. ఆగస్టు 15న కొత్తగూడెం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జాతీయ పతాక కార్యక్రమంలో పలు కీలక సైనిక ఆపరేషన్లతో పాటు అబ్దుల్ కలాంకు పర్సనల్ టీంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి మెరైన్ కమాండ్ ఫోర్సుకు చెందిన కొత్తగూడెం బిడ్డ వేముల సతీష్ కుమార్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మెరైన్ కమాండ్ ఫోర్సులో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా అందులో మన కొత్తగూడెం జిల్లా నుంచి ఏకైక వ్యక్తి సతీష్ కావడం మన గర్వకారణం. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడిని స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించడం కొత్తగూడెం ప్రెస్ క్లబ్బులో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా వీఐపీలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలకు భిన్నంగా, దేశం కోసం సేవ చేసిన సైనికుడికి గౌరవం ఇవ్వాలనే నిర్ణయాన్ని విలేఖరులు తీసుకున్నారు. సైనికుడి చేతిలో జెండా.. బలమైన సందేశం....

15-08-2026