సమాచార శాఖ కీలకం
- అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ఐఅండ్ పీఆర్ ఏడీ, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత
కరీంనగర్, ఆగస్టు15(విజయక్రాంతి): విధి నిర్వహణలో అంకితభావంతో అత్యుత్తమ సేవలు అందిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. లక్ష్మ ణ్ కుమార్‌తో పాటు పీఆర్వో జగన్మోహన్, డ్రైవర్ తిరుపతిలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు.. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని,
విధి నిర్వహణలో అంకితభావం తో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని గు ర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు మీడియాకు సమన్వయకర్త లుగా వ్యవహరిస్తూ శాఖకు మంచి పేరు తీసుకువస్తున్న డీపీఆర్వో లక్ష్మణ్ కుమార్, పీఆర్వో జగన్మోహన్, డ్రైవర్ తిరుపతిల సేవలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న సందర్భంగా వారు తమకు లభించిన గుర్తింపు మరింత బాధ్యతగా పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.






