16 August, 2026 | 10:17 PM

Districts - Medchal Malkajgiri

article_55906397.webp
కల్తీ పెరుగు, కోవా తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ దాడి

ఉప్పల్ ఆగష్టు 16, విజయక్రాంతి: కాప్రా సర్కిల్ పరిధిలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తున్న నందిని మిల్క్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కల్తీ పెరుగు, కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి తయారీ, గడువు తేదీలు, నాణ్యతకు సంబంధించిన లేబుళ్లు లేకుండా ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల తనిఖీల్లో సుమారు 120 కిలోల కత్తి పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిల్క్ సెంటర్‌లో నిర్వహించిన సోదాల్లో మరో 50 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను పరీక్షల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సమాచారం.

16-08-2026

article_87139893.webp
వైభవంగా బోనాల పండుగ వేడుకలు

ఘట్ కేసర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బోనాల పండగను ఆదివారం ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల, కాచవాని సింగారం, అన్నోజిగూడ, పోచారం ప్రాంతాలలోని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాలతో శివసత్తుల పూనకాలతో వెంటరాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అమ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరు కోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం యువకులు తీసిన తొట్టెల, పలహారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

16-08-2026

article_86995487.webp
ఉప్పల్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలు

ఉప్పల్ ఆగష్టు 16(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తి భావంతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

16-08-2026

article_49397331.webp
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కుత్బుల్లాపూర్, ఆగష్టు 15(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ ఐక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని, భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

15-08-2026

article_75020908.webp
డంపింగ్ యార్డును యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలి

డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విష తుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతుందని వెంటనే డంపింగ్ యార్డును శాస్త్రీయ పద్ధతిలో యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ డిమాండ్ చేశారు. చెత్త రామ్కి డంపింగ్ యార్డ్ ను శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమామహేశుల ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ నగర్ మాజీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.

14-08-2026