రాజకీయ కేంద్రంలో ట్రెండ్ మార్చిన పార్టీలు
- పోటా పోటీగా జన సమీకరణ
- ఎన్నికలకు రెండేళ్ల ముందే రాజకీయ సందడి
- జంప్ జిలానీలపై సర్వత్రా చర్చ
నిర్మల్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని(Adilabad District) రాజకీయ కేంద్రమైన నిర్మల్ జిల్లాలో రాజకీయ సందడి ప్రారంభమైంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్న అప్పుడే నిర్మల్ జిల్లాలో(Nirmal District) ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ(Congress, Bharat Rashtra Samithi, Bharatiya Janata Party) పూట పోటీ కార్యక్రమాలను నిర్వహించి జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్, నియోజకవర్గాలు ఉండగా ఖానాపూర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే వెడమో బొజు పటేల్, ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
నిర్మల్ లో బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ లో పవర్ రామారావు పాటి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయింది. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాల కారణంగా పార్టీ సరైన పట్టు సాధించలేకపోవడంతో కార్యకర్తలు నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. డిసిసి అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బెడమ బొజు పటేల్ పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న బిజెపి ఉన్న బిజెపి పార్టీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టింది. పది సంవత్సరాలపాటు పాలించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా తన పూర్వ వైభవం కోసం క్షేత్రస్థాయిలో లీడర్లు కదిలారు. బూత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఇన్చార్జిగా ఆ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బిజెపిలో మాత్రం జిల్లాలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా బిజెపి ని ముందుకు నడిపిస్తూ ఐక్యతతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మూడు పార్టీలు ప్రత్యేక దృష్టి
నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ బిజెపి భారత రాష్ట్రపతి మూడు ప్రధాన పార్టీలు రాబోయే రెండు సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండి కేడర్ చేజారిపోకుండా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలం పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ నేతృత్వంలో ఇప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్ తీరుపై ఎండ కడుతూనే అధికారులు ఉన్న మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు అనేక ఉద్యమాలు చేపడుతున్నారు.
సర్ ను వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఎన్నికల కమిషన్ ను విధుల నుంచి తప్పించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు చోరీ పేరుతో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సర్ ప్రక్రియ పేరుతో జిల్లా వ్యాప్తంగా అరులైన ఓట్లను తొలగించి బిజెపి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసింది.
ఇక భారతీయ జనతా పార్టీ బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ప్రజాస్వామ్య పరిరక్షణ, సర్పక్రియ సమర్థిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఆ పార్టీ రాష్ట్ర అగ్ర నేతలు రామచంద్రరావు, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లా కేంద్రంలో కాషాయ దళం సర్ ను సమర్థిస్తూ దీన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కాంగ్రెస్ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారు.
ఇంతకుముందు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఇంద్రవెల్లి అమరవీరుల సుఖం వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు పశ్చిమ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించారు. ఈనెల 1న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ నాయకత్వంలో అదిలాబాదులో రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
తాజాగా ఈనెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి యువ నేత కల్వకుంట్ల తారక రామారావు యువ గర్జన పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారే ఆ పార్టీ కార్యక్రమాలకు ప్రజల్లోకి వెళ్లి ప్రజాబలం కూడగట్టుకునేందుకు ఇప్పటినుండి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడిపడింది. నెల రోజుల క్రితం అన్ని పార్టీలు సభ్యతగా ఉండగా ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలతో ప్రజాబలం నిరూపించుకునేందుకు జనాల్లోకి వస్తుండడంతో ఎన్నికలకు ముందే నిర్మల్ జిల్లాలో ప్రధాన పార్టీలో రాజకీయ సందడి ఎక్కింది
జంపు జిలానీలపై ప్రత్యేక దృష్టి
రాబోయే రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీలు మారే అవకాశాలు ఉండటంతో వారు ఏ పార్టీ వైపు వెళ్తారు అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నిన్న మొన్నటి వరకు రెండు గ్రూపులుగా ఉండగా ఇప్పుడు అది ఐదు గ్రూపులకు పేర్కొందని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తే కార్యకర్తలు ఏ నేత కింద ఎట్లా పనిచేయాలో అర్థం కాక నేతల తీరు నచ్చక పార్టీలు వారెందుకు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయా పార్టీల అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కాంగ్రెస్ బిజెపిలో కూడా కొందరు నేతలు పార్టీ మారే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో కూడా బిజెపి కాంగ్రెస్ లో ఉన్న ఒకరిద్దరి ముఖ్య నేతలు మళ్లీ కారు ఎక్కేందుకు చర్చలు జరుపుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వేణుగోపాలచారి, అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి వంటి అగ్ర నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు మారి వారు ఎటువైపు చర్చ జరుగుతోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యేలైన విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ రేఖా శ్యాం నాయక్ వంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో వారు పార్టీలో ఉంటారా వేరే దారి చూసుకుంటారు నా చర్చ జరుగుతుంది.
జిల్లాలో బిజెపికి చెందిన ఒకరిద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీని వదిలి భారతీయ రాష్ట్ర సమితిలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు కూడా రాజకీయ అవకాశాల కోసం బిజెపిలో చేరేందుకు సంప్రదింపులు జరుపు తున్నారన్న ప్రచారం జిల్లాలో అందుకుంది. అగ్ర నేతలు పార్టీలు మారితే వారి కింద పనిచేసే ఆయన అనుచర ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీలు మారే అవకాశం ఉండడంతో ఇప్పుడు మూడు పార్టీలో జంపు జలానీల రాజకీయంపై తీవ్ర చర్చ జరుగుతుంది.
మరోవైపు తెలంగాణ రక్షణ సేన పార్టీ వైపు కూడా కొందరు ముగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు. నిర్మల్ లో తనకంటూ కేడర్ ఉన్న ఎంఐఎం పార్టీ కూడా నిర్మల్ బైంసాలో తన అభ్యర్థులను రం గంలో దించే అవకాశం ఉండడంతో ఇప్పటినుండి కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏదేమైనా పొలిటికల్ కేంద్రంగా పేరిందిన నిర్మల్ జిల్లాలో పార్టీ లు ప్రజల మద్దతును పొందినందుకు బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.