అల్పాహార పథకాన్ని పరిశీలించిన సర్పంచ్

12-11-2026 | 04:29pm

వెల్దుర్తి, నవంబర్ 12, (విజయక్రాంతి ): వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలోని(Melluru Village) ప్రాథమిక పాఠశాలలో(Primary school) విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాన్ని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా పరిశీలించారు.

ఆహార నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ  నవీన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు