883 నూతన చేయూత పెన్షన్ మంజూరు

12-11-2026 | 04:34pm

పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, నవంబర్ 12( విజయక్రాంతి ): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో(Indravelly Mandal Headquarters) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 883 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని,

ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన రేషన్ కార్డులు అందించామని, ఖానాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా దశలవారీగా అర్హులందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున నీటిని వృథా చేయకుండా జలశ్రీ కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నీటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ ,ఎం ఆర్ ఓ , ప్రవీణ్ కుమార్,ఎంపీడీఓ మహేందర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  1. మామిడిగూడలో నూతన వీవో భవనానికి భూమిపూజ..
  2. పూలాజీ బాబా ధ్యాన మందిరం 27వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గ్రామంలో గురువారం నూతన వివో భవన నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  భూమిపూజ చేశారు. అనంతరం పూలాజీ బాబా ధ్యాన మందిరం 27వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని, పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలాజీ బాబా గారంటే తనకు ఎంతో అభిమానం అని, ఆయన బోధించిన ఆధ్యాత్మిక మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు