సాంప్రదాయానికి ప్రతిక దండారి ఉత్సవాలు

12-11-2026 | 04:37pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): మండలంలోని చిర్రకుంట గ్రామంలో నిర్వహించిన గుస్సాడీ, దండారీ వేడుకల్లో(Gussadi and Dandari Festival) డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్ పాల్గొన్నారు. ఆదివాసీలతో కలిసి సంప్రదాయ నృత్యాలను తిలకించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గుస్సాడీ బృందాలకు రూ.15 వేల ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో AMC డైరెక్టర్ వైరాగడ్ మారుతి పటేల్, జక్కన్న విశ్వనాథ్, మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, మాజీ ఎంపీటీసీ సిడం తిరుపతి, మాజీ సర్పంచ్ కాశయ్య, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు