వివాదాల్లో చిక్కిన ఎస్‌ఏఎస్ టవర్స్

18-11-2026 | 05:40am

నిర్మాణ వ్యవహారంలో రూ.వందల కోట్ల ఆరోపణలు!

ఖాజాగూడ ప్రాజెక్టుపై ‘రేరా’ సుమోటో విచారణ

విక్రయాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా 

నిలిచిన నిర్మాణ పనులు ఆందోళనలో కొనుగోలుదారులు

శేరిలింగంపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం(Western region of Hyderabad) లోని రియల్ ఎస్టేట్ రంగంలో(Real Estate Sector) మరో భారీ ప్రాజెక్టు వివాదం చర్చనీయాంశంగా మారింది. ఖాజాగూడ సర్వే(Khajaguda Survey) నంబర్ 19లో చేపట్టిన ఎస్‌ఏఎస్ టవర్స్ వాణిజ్య సముదాయ నిర్మాణ(Construction of the SAS Towers commercial complex) వ్యవహారం ఇప్పుడు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య చిక్కుకుంది.

వందల కోట్ల రూపాయల విక్ర యాలు, నిధుల వినియోగం, భూ యజమానులు డెవలపర్ల(Landowners and developers) మధ్య ఒప్పందాలపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన కొనుగోలుదారులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందు తున్నారు. భారీ అంచనాలతో ప్రారంభమైన నిర్మాణం ఆశించిన స్థాయిలో ముం దుకు సాగకపోవడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ(Telangana Real Estate Regulatory Authority) (-రేరా) సుమోటోగా విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏడేళ్లుగా కొనసాగుతున్న నిర్మాణం..

రేరా విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు 2018లో అభివృద్ధి ఒప్పందంతో ప్రారంభమైంది. సుమారు 37 అంతస్తులతో వాణిజ్య సముదాయం గా నిర్మించ తలపెట్టిన ఈ టవర్‌లో కార్యాలయాలు, వాణిజ్య స్థలాలను విక్రయించా రు. 2024 చివరి నాటికి నిర్మాణ పనుల వేగం గణనీయంగా తగ్గడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురయ్యారు. భూ యజమానులు, నిర్మాణ సంస్థ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి కొనుగోలు దారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్లు రేరా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో 400 మందికి పైగా కొనుగోలుదారుల పెట్టుబడులు ఉన్నట్లు వారి సంఘం వాదించింది. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి నిధుల సమీకరణ, భూ యాజమాన్య హక్కులు, విక్ర యాలపై స్పష్టత అవసరమనే అంశాలు తెరపైకి వచ్చాయి.

విక్రయాలపై అనుమానాలు..

భూ యజమానులు రేరాకు సమర్పించిన ఫిర్యాదులో సుమారు 23 లక్షల చద రపు అడుగుల నిర్మాణ విస్తీర్ణాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు. అయితే అధికా రిక లెక్కల్లో సుమారు రూ.900 కోట్ల విక్రయ విలువ మాత్రమే చూపించారని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.2,550 నుంచి రూ.12,500 వరకు ధరలకు విక్రయాలు జరిగినట్లు చెబుతూ, వాస్తవంగా ఎంత మొత్తం వసూలైంది? ఎంత మొత్తానికి ఒప్పందాలు జరిగాయి? నగదు రూపంలో లావాదేవీలు జరిగాయా? అనే అంశాలపై విచారణ కోరారు. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించారన్నది భూ యజమానుల ప్రధాన ఆరోపణ. అయితే డెవలపర్ సంస్థ ఈ ఆరోపణలను ఖండించినట్లు రేరా ఉత్తర్వుల్లో నమోదైంది. ఈ ఆరోపణలు ఇంకా విచారణలో తేలాల్సి ఉంది.

వ్యయం రూ.817 కోట్లు.. నిధుల సమీకరణ ఎలా?

రేరా విచారణలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నిర్మాణ విభాగం అంచనా ప్రకారం మిగిలిన పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.817 కోట్లు అవసరమని, ఇతర ఖర్చులు, నిధుల వ్యయాలు కలిపితే మొత్తం అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని భూ యజమానుల తరఫున వివరించారు. మరోవైపు డెవలపర్ సంస్థ మాత్రం భూ యజమానుల నుంచి ఎదురవుతున్న ఆంక్షలు, విక్రయాలకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల అవసరమైన నిధులు సమీకరించలేకపోతున్నామని వాదించింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ప్రాజెక్టు నిర్మాణ పురోగతికి అడ్డంకిగా మారినట్లు రేరా పరిశీలనలో వెల్లడైంది.

రేరా కీలక ఆదేశాలు,ప్రత్యేక ఖాతాలోకి నిధులు..

ఈ వ్యవహారంపై 2025 ఆగస్టు 23న వెలువరించిన ఉత్తర్వుల్లో రేరా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టులో భవిష్యత్తులో జరిగే విక్రయాలు, లీజుల ద్వారా వచ్చే మొత్తాల్లో చట్టప్రకారం 70 శాతం నిధులను ప్రత్యేక రేరా ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఇంజినీర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరణ ఆధారంగానే నిర్మాణ పనుల పురోగతికి అనుగుణంగా నిధులు ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రతి మూడు నెలలకు బ్యాంకు లావాదేవీలు, ఆదాయ వ్యయ వివరాలను సమర్పించడంతోపాటు నెలవారీ నిర్మాణ పురోగతిని ఛాయాచిత్రాలు, ధ్రువీకరణ పత్రాలతో వెల్లడించాలని సూచించింది. కొనుగోలుదారుల సంఘం ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రేరా ఏమన్నదంటే?

భూ యజమానులు నిధుల మళ్లింపుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరినప్పటికీ, ప్రాథమిక ఆధారాలతో నిధుల దుర్వినియోగం నిర్ధారణ కాలేదని రేరా పేర్కొంది. ఈ దశలో పూర్తిస్థాయి ఆడిట్ చేపడితే నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అయితే నిర్మాణ పురోగతికి అనుగుణంగా ఖర్చుల వివరాల్లో 15 శాతానికి మించి వ్యత్యాసం కనిపించినా, వరుసగా మూడు నిర్మాణ లక్ష్యాలు విఫలమైనా పరిమిత స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టడంతోపాటు ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ రద్దు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. డెవలపర్ మార్పు కోరుతూ భూ యజమానులు చేసిన విజ్ఞప్తిని కూడా అప్పట్లో ముందస్తు దశలో ఉందని తిరస్కరించింది.

మరిన్ని వార్తలు